Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొక్కించి చంపేశారు : ఆర్ నారాయణమూర్తి
- లఖీంపూర్ రైతు అమరవీరులకు నివాళి
- ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
- నేడు రేపు నిరసనలు తెలుపాలి : టీ సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా (1906) ఉవ్వెత్తున లేచిన ఆనాటి రైతాంగ ఉద్యమానికి లార్డ్‌మింటో సహకరించారనీ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈనాటి రైతాంగ ఉద్యమానికి మోడీ స్పందించకపోవడం విచారకరమని సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 14నెలలుగా రైతులు ఉద్యమం చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించడం లేదన్నారు. లార్డ్‌మింటో కంటే మోడీ యమడేంజర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు అమరవీరుల చిత్రపటం వద్ద ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ రైతుల పట్ల బీజేపీ కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రా క్రూరత్వాన్ని ప్రదర్శించాడని చెప్పారు. వాహనాలతో తొక్కించి చంపేశారన్నారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి మాట్లాడుతూ కేంద్ర మంత్రి అజరుమిశ్రాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆశిష్‌మిశ్రాను అరెస్టు చేశారనీ, అయితే యూపీ ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదనీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను వాహనాలతో తొక్కించడంతో ఐదుగురు మరణించినప్పటికీ ప్రధాని మోడీ స్పందించడక పోవడాన్ని వారు తప్పుపట్టారు. లఖీంపూర్ ఘటనను వ్యతిరేకిస్తూ 18న రాస్తారోకోలు, 26న లక్నో నగరంలో రైతు మహాపంచాయతీ నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. రైతు,కార్మిక వ్యతిరేక సాగు చట్టాలను, కార్మిక కోడ్లను వెం టనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మూఢ్శోభన్ (తెలంగాణ రైతుసంఘం), కూరపాటి రమేష్, పద్మశ్రీ (సీఐటీయూ), బి పద్మ, ఆంజనే యులు (వ్యకాస), కె హిమబిందు (టీపీఎస్కే), కోట రమేష్ (డివైఎఫ్ఐ), కేవీఎస్ఎన్ రాజు (పట్నం), నగర నాయకులు జి రాములు పాల్గొన్నారు.