Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ చైర్మెన్ పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి
- కర్నూలు ఆస్పత్రిలో గుడిసె ప్రమాద చిన్నారులు
నవతెలంగాణ - అయిజ
మట్టి గోడ కూలి తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులను ఆదుకుని, అండగా ఉంటామని జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మెన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయన సోమవారం పరామర్శించి మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించినట్టు తెలిపారు. గాయపడిన పిల్లలకు ఎమ్మెల్యే డాక్టర్ వి.అబ్రహం కర్నూలులో చికిత్స చేయిస్తున్నట్టు చెప్పారు. అలాగే, మాజీ ఎంపీ మందా జగన్నాథం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వీరి వెంట మున్సిపల్ చైర్మెన్ చిన్న దేవన్న, జెడ్పీటీసీ చిన్న హనుమంతు, సర్పంచ్ గోపాలకృష్ణ తదితరులున్నారు.