Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎమ్‌డీకి కూడా లేఖ రాశారు. కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు అక్ర మంగా నీటిని తరలించడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జాతీయ జల విధానానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం ఇవ్వొద్దని కోరారు.