Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబితకు టీపీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్న ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ లేఖ రాశారు. గత విద్యాసంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు నెలరోజులే జరిగాయని తెలిపారు. మిగిలిన రోజుల్లో ఆన్లైన్ బోధన సాగిందని వివరించారు. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, నెట్వర్క్ అందుబాటులో లేదని పేర్కొన్నారు.
కోవిడ్-19 నేపథ్యంలో గత జూన్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారని గుర్తు చేశారు. ఆర్నెల్ల తర్వాత ఫస్టియర్ పరీక్షలు రాసేందుకు వారు సిద్ధంగా లేరని తెలిపారు. ప్రస్తుతం పగలు సెకండియర్ తరగతులకు హాజరవుతూ, రాత్రి ఫస్టియర్ పాఠాలు తిగిరి చదవడం విద్యార్థులను గందరగోళానికి, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళను చెందుతున్నారని వివరించారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రస్తుతం చదువుతున్న సెకండియర్ పాఠాలు దెబ్బతింటాయని తెలిపారు. గురుకుల కాలేజీలు, వసతి గృహాలు ఇప్పటికీ మూతపడి ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో చదివే విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యే అవకాశం లేదని వివరిం చారు. పరీక్షలు జరిగే రోజుల్లో వారు ఎక్కడ ఉండి ఏం తిని రాయాలనే సమస్య ఉత్పన్నమవుతున్నదని తెలిపారు. ప్రయివేటు కాలేజీలు ఫీజు చెల్లిస్తేనే హాల్టికెట్లు ఇస్తామనే మెలికతో విద్యార్థులు ఇబ్బందులు పడు తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనందున ప్రమో టైన ఫస్టియర్ పరీక్షల నిర్వహణ వల్ల ఒరిగేదేం లేదని వివరించారు.