Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గు నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదముందని తెలుగుదేశం తెలంగాణ శాఖ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ మంత్రులు సంక్షోభం రాదనడం అవగాహనారాహిత్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పొరపాట్లు చేశారనీ, ఈనేపథ్యంలో రాష్ట్రం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం సింగరేణి బొగ్గు నిల్వలపైనే నడుస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులైన పారేలా చేశారని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యదేవర లత, అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర కార్యదర్శి ముంజా వెంకటరాజంగౌడ్ పాల్గొన్నారు.