Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 నామినేషన్ల తిరస్కరణ
- ఈటల, గెల్లు, బల్మూరి నామినేషన్లు ఓకే
నవతెలంగాణ-హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. 23 నామినేషన్లను తిరస్కరించారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఈ నెల 1 నుంచి 8 వరకు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లను దాఖలు చేయగా.. సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు అభ్యర్థుల సమక్షంలో స్కూట్నీ నిర్వహించారు. 19 మందికి చెందిన 23 నామినేషన్ల పత్రాలు సరిగా లేనందున తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పత్రాలు సరిగా ఉన్నట్టు తెలిపారు. 42 మంది అభ్యర్థులకు చెందిన 69 నామినేషన్లు ఎన్నికల నిబంధనల ప్రకారం ఉన్నాయన్నారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని తెలిపారు.