Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలనరహితం కావద్దు
- నేడు ప్రపంచ ఆర్థరైటీస్ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏ వ్యాధినైనా ప్రారంభదశలో గుర్తిస్తే సాధారణ చికిత్సతో దాన్నుంచి బయపడవచ్చు. ఆలస్యం చేస్తే ఎక్కువ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులతో జీవితాన్ని చలనరహితంగా మార్చే ఆర్థరైటీస్ వ్యాధుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటీస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్థరైటీస్ అనేది కీళ్ల వాపునకు ఉపయోగించే పదం. కీళ్లు దెబ్బతినటంతో నొప్పి, వంకర్లు తిరగటం, వైకల్యానికి గురి కావటం తదితర రుగ్మతలు వస్తాయి. ఇవి చిన్న పిల్లలు మొదలు వయస్సు పైబడిన ఎవరినైనా ప్రభావితం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 'ఆలస్యం చేయవద్దు, ఈ రోజే కనెక్ట్ అవ్వండి: ఇదే సరైన సమయం' అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాత శిక్షణ పొందిన నిపుణులైన ఫీజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, సైకోథెరపిస్ట్, రుమటాలజిస్ట్ లతో చికిత్స అందిం చాల్సి ఉంటుంది. ఈవ్యాధి రావటానికి వంశపారం పర్యం, అనారోగ్యకరమైన జీవనశైలి, గాయం, ఊబకాయం, వయస్సు సంబంధిత, జీవక్రియ కారణాలు, ఇన్ఫెక్షన్ లాంటివి కారణమవుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, బరువు నిర్వహణ వంటి వాటిని మార్చుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శస్త్రచికిత్సతో మెరుగైన జీవితం : డాక్టర్ కామరాజ్
వ్యాధి తీవ్రమైన దశలో సాధారణ చికిత్స, ఫిజియో థెరపీ ఉపయోగపడబోవని హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కామరాజ్ అన్నారు. మొత్తం జాయింట్లను రిప్లేస్ మెంట్ అంటే తుంటి లేదా మోకాలికి మొత్తం కీళ్ల మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. సర్జరీ తర్వాత రోగి నొప్పి లేని కీలుతో తేలికపాటి అన్ని క్రీడలతో సహా సాధారణ పనులు చేసుకోవచ్చని తెలిపారు.