Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మల్లెపల్లి లోని అన్వర్ ఉల్ ఉలూమ్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్‌లో ఆలమీ ఉర్దూ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన ఇస్లామిక్ సమకాలీన కళా, కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ సాహాబ్ (అన్వర్ ఉల్ ఉలూమ్ గ్రూప్ చైర్మెన్), వేద కుమార్ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మెన్-మణికొండ) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ సాహాబ్, ప్రఖ్యాత కాలిగ్రఫీ ఆర్టిస్ట్ మహమ్మద్ రఫీయుద్దీన్ ఆలమిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడాన్ని అభినందించారు. కాలిగ్రఫీని విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరమున్నదని వేదకుమార్ పేర్కొన్నారు. జనబ్ సర్వత్ అలీ, మౌలా రియాజ్ నక్ష్‌బండి, డాక్టర్ ఎండీ ఇమామ్ తహసీన్, మీర్జా సర్ధార్ బేగ్, టి.చిదంబరన్ వంటి ప్రముఖులతో పాటు సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.