Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ఆశ్రమం లో సోమవారం చినజీయర్ స్వామిని, సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా వేదపండి తులు సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దంపతులను చినజీయర్ స్వామి శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆశ్రమం లోని నిత్యాన్నదాన సత్రంలో ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం చేశారు. కుటీర ప్రాంగణంలో చిన జీయర్ స్వామితో కలసి కేసీఆర్ జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసిఆర్ శోభ మ్మ దంపతులతో పాటు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, టీటీడీ బోర్డు సభ్యుడుమై హౌమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కావేరి సీడ్స్ భాస్కర్ రావు, శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమేరు కుమార్, పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీవో చంద్రకళ, ఆశ్రమ నిర్వాహకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.