Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదు : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదనీ, పండుగల సమయాల్లో ప్రజలు మరింత జాగ్రత్త్గగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచిం చారు. హైదరాబాద్ కోఠిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కరోనా సోకని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విందులు, షాపింగ్ సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా యనీ, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలనీ, డిసెంబర్ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.
మూడు నెలలుగా తగ్గుముఖం
గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని శ్రీనివాసరావు చెప్పారు. కొవిడ్ రికవరీ రేటు చాలా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితులు దాదాపు కనిపిస్తున్నాయనీ, సాధారణ జీవనంలోకి వస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.01కోట్ల మందికి ఒక డోసు కొవిడ్ టీకా ఇచ్చామనీ, వీరిలో 38శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్టు వివరించారు. రెండు డోసులు తీసుకుంటేనే కోవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని తెలిపారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అందరికీ సోకుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో థర్డ్ వేవ్‌ను అడ్డుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు.