Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో కుదింపు
- ఈ విద్యాసంవత్సరానికే వర్తింపచేసిన సర్కారు
- ద్వితీయ భాషగా ఉర్దూకు అవకాశం
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ ఉపశమనం కలిగింది. గత విద్యా సంవత్సరంలోనూ ఈ అవకాశం ప్రభుత్వం కల్పించింది. 2019-20 విద్యాసంవత్సరం వరకు పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఆరు సబ్జెక్టులను 11 పేపర్లకు నిర్వ హించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విద్యా ర్థులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు, వారిపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా వాటిని 11 నుంచి ఆరు పేపర్లకు ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ అవకాశం ప్రస్తుత విద్యా సంవత్సరానికే వరకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ద్వితీయభాషగా తెలుగు, హిందీ సబ్జెక్టులకు మాత్రమే అవకాశముం డేది. ఇప్పుడు ఉర్దూకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈనెల 5న ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్షలుజరిగాయి. డిసెంబర్ 1 నుంచి 8 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -1, 2022, ఫిబ్రవరి 28న ఎఫ్ఏ-2, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్ఏ-2 పరీక్షలను జరుగుతాయి. మార్చి లేదా ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఆయా విద్యా ర్థులకు ఫిబ్రవరి 28కి ముందే ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
70 శాతం సిలబస్ : పదో తరగతి విద్యార్థులకు 70శాతం సిలబస్‌తోనే పరీక్షలను నిర్వహిం చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరంలో అమలు చేసినట్టుగానే ప్రస్తుత విద్యా సంవత్సరంలో సిలబస్‌ను అమలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రక టించారు. పాఠశాలవిద్యాశాఖ సంచాలకులు అందుకనుగుణంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పదోతరగతి విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగింది.