Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యుత్ కోతలకు ఆస్కారం లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో విద్యుత్ కోతల కు అసలు ఆస్కారమే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోదని హామీనిచ్చారు. మంగళవారం హైద రాబాద్‌లో తనను కలిసి విలేకర్లతో మంత్రి మాట్లాడారు. రెండువందల ఏండ్లకు సరి పడా బొగ్గునిల్వలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. దీనిపై దేశాన్ని పాలిస్తున్న పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్‌కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. రాజధాని నుంచి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్... రాష్ట్రానికి పూర్తిస్థాయిలో సరిపోతున్నదని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలతోనే కరెంట్ కోతలు వస్తాయని వివరించారు.