Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణా జలాల తరలింపును
- ఆనాడు ఎందుకు అడ్డుకోలే..
- ప్రజల బలంతో లక్షా 92 వేల ఉద్యోగాలు సాధిస్తా
- కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం : రేవంత్‌రెడ్డి
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్
''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజలాలను రాయలసీమకు తరలిస్తుంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఎందుకు అడ్డుకోలేదు.. నేటికీ పాలమూరు జిల్లాలో నీళ్లు లేక ఎడారిగా మారుతున్నా కేసీఆర్ ప్రభుత్వంలో చలనం లేదు.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పారు. అందుకోసం వలస జిల్లా పాలమూరు గడ్డపై నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ మోగించాం'' అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామ శివారులో నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో కేసీఆర్ వదిలేసిన లక్ష 92 వేల ఉద్యోగాలు సాధిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ విస్తరణకు, కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరగడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్‌మెంట్ ఊసే లేదన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కోయిల్‌సాగర్, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎత్తిపోతల పథకాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. పాలమూరు యూనివర్సిటీకి నిధులు కేటాయించడం లేదన్నారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగులు కలిగిన రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోడీ.. గల్లీలో కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు గీతారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి సంపత్ కుమార్, మధుయాష్కిగౌడ్, ఉమ్మడి జిల్లా నాయకులు వంశీకృష్ణ, వంశీచందర్ రెడ్డి, దొబ్బే దుల్ల కొత్వాల్, వెంకటేష్ ప్రదీప్ గౌడ్, శివకుమార్ రెడ్డి, పీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాన్వారు అడ్డగింత
జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద పోలీసులు రేవంత్ కాన్వారుని అడ్డుకున్నారు. కాన్వారు మొత్తం కాకుండా కేవలం రేవంత్ వాహనం ఒక్కటే పట్టణం గుండా వెళ్లడానికి అనుమతిచ్చారు. మొత్తం వాహనాలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చివరకు అనుమతిచ్చారు.