Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏఓయూ)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఆలస్య రుసుం రూ.200తో ఈనెల 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు వంటి వివరాలను www.braouonline.in వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580 లేదా 040 23680290/291/294/295 ఫోన్నెంబర్లను సంప్రదించాలని సూచించారు.