Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ఎనిమిదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ నర్సాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాదిబోయిన సత్యనారాయణ తన ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేండ్ల చిన్నారిని తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి పాపకు స్నానం చేపించే క్రమంలో నొప్పిగా ఉందని స్నానానికి సహకరించకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. ఆ చిన్నారితో ఆడుకునే పిల్లల ద్వారా ఏం జరిగిందో తెలుసుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇలాంటి విషయం బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని మనస్తాపం చెందారు. విషయాన్ని ఇలాగే ఉంచితే ఆ దుర్మార్గుడు ఇంకెంత మంది బాలికలను తన వికృత చేష్టలకు బలిచేస్తాడోనని ధైర్యం తెచ్చుకొని బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దాంతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్ఐ బి. సురేష్ తెలిపారు. నిందితుడు అధికారపార్టీకి చెందిన వ్యక్తిగా తెలిసింది.