Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుతో దరఖాస్తులదారుల నిరసన
నవతెలంగాణ-లింగంపేట్
ఎస్టీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలు వాయిదా వేయడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దరఖాస్తుదారులు కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు ప్రకటించడంతో ఉదయం 11 గంటలలోపే లబ్దిదారులు తరలివచ్చారు. మండలానికి 12 యూనిట్లు మంజూరు కాగా 160 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో ఇంటర్వ్యూలకు హాజరవ్వగా.. గంటల తరబడి అధికారుల కోసం నిరీక్షించారు. చివరకు సంబంధిత మండల పరిషత్ అధికారులు కార్పొరేషన్ ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్టు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.