Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం అడుగుజాడల్లోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిరాశనిస్పృహలతో ఉన్నారని తెలిపారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల ప్రస్తుతం వడ్లు కొనే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారనిఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మిల్లర్ల దగ్గర ధాన్యం నిల్వ ఉండడం, ఒకవేళ బియ్యం చేసి అమ్మినా కొనే నాథుడే లేడని వివరించారు. ఎక్కువ కాలం వరి ధాన్యం నిల్వ ఉంచడం వల్ల ముక్కిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలూ అదే విధానాన్ని అనుసరిస్తుండడంతో రైతులు వీధిన పడ్డారని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని పక్షంలో వారు ఉద్యమబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నిరాశనిస్పృహలకు గురికావొద్దని కోరారు.