Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం
- 1,654 మంది నియామకానికి సర్కారు అనుమతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను 2021-22 విద్యాసంవత్సరంలో కొనసాగించా లని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 గెస్ట్ లెక్చరర్లను నియమించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి రోనాల్ రోస్ జీవోనెంబర్ 1293ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశిం చారు. బుధవారం గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని జలీల్ ప్రకటించారు. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో వారిని ఐదు నెలల కోసమే పార్ట్‌టైం ప్రాతిపదికన తీసుకుంటున్నామని వివరించారు. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లనే ప్రస్తుత విద్యాసంవత్సరానికి కొనసాగించాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, వేముల శేఖర్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య హర్షం ప్రకటించారు.