Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 జిల్లాల్లో 10 లోపే కేసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం 38,834 మందికి కరోనా టెస్టులు చేయగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది. 162 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,211 యాక్టివ్ కేసులున్నాయి. జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ములుగు, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆదిలాబాద్(1), జయశంకర్భూపాలపల్లి(1), కొమురంభీమ్ అసిఫాబాద్(1), మెదక్(1), నాగర్కర్నూల్(1), నారాయణపేట్(1)వికారాబాద్, (1) కేసులొచ్చాయి. 30 జిల్లాల్లో పది, అంత కంటే తక్కువ మందికే పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 14, కరీంనగర్లో 11, నల్లగొండలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 చొప్పున కేసులు వచ్చాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.78 శాతముంది.