Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సునీల్ శర్మ, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కేఎస్.శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ జీవో నెంబర్ 2296ని జారీ చేశారు. ఇప్పటిదాకా విద్యుత్ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్కుమార్సుల్తానియాను ఆ పనుల నుంచి రిలీవ్ చేశారు. సునీల్‌శర్మ ఇప్పటిదాకా రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహించిన విషయం విదితమే.