Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడువు కోరిన తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కృష్ణా,గోదావరి పరిధిలను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ గురువారం నుంచి అమలులోకి రానుంది. గెజిట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతి తెలపగా, తెలంగాణ ప్రభుత్వం రెండు వారాలు గడువు కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న కృష్ణా బోర్డు పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, జలవిద్యుత్ కేంద్రాల సమాచారం, వివరాలను ఆ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సమర్పించింది. అంతేకాకుండా గెజిట్ అమలుకు సంబంధించి కృష్ణా బోర్డు పంపిన తీర్మానానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం, దీనిపై నిపుణుల కమిటీని నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు వ్యవహరించాలని, అందుకు రెండు వారాలు గడువు కృష్ణా బోర్డును కోరినట్లు తెలిసింది. కాగా, గెజిట్ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపినందున నేటి నుంచి ఏపీ భూభాగంలోని కృష్ణా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి.