Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క గేటు ద్వారా నీటి విడుదల
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం ఒక్క గేటు ద్వారా 27,983 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం మూడు గంటల సమయానికి శ్రీశైల జలాశయానికి ఎగువ జూరాల నుండి 1,04,112 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 16,968 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 884.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టిఎంసిలుగా నమోదయింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 5000, మహాత్మ గాంధీ కల్వకుర్తి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 17.014 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 15.278 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 63,302 క్యూసెక్కులు దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు.