Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్, ట్యాంకర్ అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక బాధ్యతలో భాగంగా (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పది లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్‌ను కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కేహెచ్. పట్నాయక్ చేతుల మీదుగా ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి బుధవారం హైదరాబాద్‌లో అందించారు. హైటెక్‌సిటీలో కొత్తగూడ సమీపంలోని బొటానికల్ గార్డెన్ నిర్వహణకు దీనిని వాడనున్నారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరా బాద్‌కు బొటానికల్ గార్డెన్ ఒక విలువైన ప్రకృతి సంపద అనీ, దానిని కాపాడటంలో భాగంగా తమ వంతుగా ఈ సహాయం చేశామని తెలిపారు. అనంతరం బ్యాంకు ప్రతినిధులు, కార్పోరేషన్ అధికారులు కలిసి పార్క్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎమ్డీ జీ. చంద్రశేఖర్ రెడ్డి, జీఎం. రవీందర్‌రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు భాస్కరచక్రవర్తి, మమతా జోషి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బొటానికల్ గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.