Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్, రెబ్బెన మండలాల్లో మల్లేష్ ప్రథమ వర్థంతి
నవతెలంగాణ-తాండూర్
కడ వరకు పేదల పక్షాన పోరాడిన యోధుడు గుండా మల్లేష్ అని ఏఐటీయూసీ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిల్లా నర్సయ్య అన్నారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రథమ వర్థంతిని తాండూర్, రెబ్బెన మండల కేంద్రాల్లో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కార్మిక, కర్షకుల హక్కుల సాధనకు పోరాటాలు చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సింగరేణిలో బదిలీ వర్కర్ ఉద్యోగాన్ని వదులుకుని పార్టీలో పూర్తికాలం కార్య కర్తగా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి పేదల సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసెంబ్లీలో గళం విప్పడంతో పాటు శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక తెలం గాణ ఆవశ్యకతను తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేశ్, గోలేటి కార్యదర్శి చల్లూరి అశోక్, నాయకులు శంకర్, మహేశ్, దినేశ్, శ్రీనివాస్, గౌస్, తిరుపతి పాల్గొన్నారు.