Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయిన్పల్లి వినోద్కకుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పరిపాలనలో ప్రణాళికా, అర్థగణాంక శాఖ పాత్ర కీలకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. అర్థగణాంక, ప్రణాళిక శాఖ ముద్రించిన 'తెలంగాణ జర్నీ, స్టేట్ ఎకానమి, తెలంగాణ ఎకానమి' మూడు ప్రచురణలను బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. వాటిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అధికారులకు వినోద్‌కుమార్ లేఖ రాసి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రచురణలు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయాల లైబ్రరీల్లోనూ అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రణాళికా, అర్థగణాంక శాఖలు ప్రభుత్వంలోని ఇతర శాఖలకు దిక్సూచిగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వివిధ శాఖల పురోగతిని, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించడంలో ఆ శాఖలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని గణాంకాలతో మూడు ప్రచురణలను విడుదల చేశామని చెప్పారు. రాష్ట్ర సమగ్ర సమాచారంతో కూడుకున్న ఆ ప్రచురణలు కరదీపికగా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ సంచాలకులు జి దయానంద్, సహాయ సంచాలకులు కెవి ప్రసాదరావు, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.