Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-గోవిందరావుపేట
సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు చింతా క్రాంతి ఆధ్వర్యం లో కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 'త్యాగాలు మనవి, భోగాలు కేసీఆర్ కుటుంబానివా' అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుం దన్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేద ప్రజలకు ఒరిగిం దేమి లేదన్నారు. తలపునే గోదావరి పారుతున్నా ములుగు నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వని పరిస్థితి ఉందని వాపోయారు. ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్, ఆ అమరుల కుటుంబాలకు రోడ్డున పడేసారని విమర్శించారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులు, విద్యార్థులే టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతారన్నారు. కర్లపల్లికి చెందిన 35మంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగవాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.