Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు
- ఏడుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు
- 20 మంది స్వతంత్రులు
నవతెలంగాణ - హుజూరాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులుండగా.. ఏడుగురు ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. 20 మంది స్వతంత్రులు ఉన్నారు. ఈ నెల 1నుంచి 8వరకు నామి నేషన్లు దాఖలు చేశారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లను దాఖలు చేయగా.. స్కూటీనిలో 19 మందికి చెందిన 23 నామినేషన్లు పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కావడంతో 12 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమున, హుజూరాబాద్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, కొల్గూరి రాజకుమార్, ఇమ్మడి రవి, వినోద్ కుమార్, రేకుల సైదులు, రవీందర్, వెంకటేశ్వర్లు, నూర్జహాన్ బేగం, వరికొలు శ్రీనివాస్, మల్లికార్జున్, గుర్రం కిరణ్ నామినేషన్ను ఉపసంహరించుకున్నట్టు హుజూరాబాద్ ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట నరసింగరావు పోటీలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్సూర్ అలీ, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా సిలివేరు శ్రీకాంత్, దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా దేవునూరి శ్రీనివాస్, యువతరం పార్టీ అభ్యర్థిగా కాశెట్టి విజరు కుమార్, ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా కన్నం సురేష్ కుమార్, ఎంసీపీఐయూ అభ్యర్థిగా కర్ర రాజిరెడ్డి బరిలో ఉన్నారు.