Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెటిరో యజమాని కాలేజీపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమర్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఉన్న సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులకు చెల్లించిన జీతాల్లో కోత విధించారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా పరిస్థితుల పేరుతో గతేడాది ఏప్రిల్ నుంచి 20 శాతం, 30 శాతం, 50 శాతం, 70 శాతం, 80 శాతం చొప్పున జీతాలు చెల్లించారని వివరించారు. ఇది ఏఐసీటీఈ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతేడాదిలో దాదాపు నాలుగు నెలలు, ఈ ఏడాదిలో రెండు నెలలు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు, అప్పుడు చెల్లిస్తామంటూ యాజమాన్యం కాలయాపన చేస్తున్నదని పేర్కొన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం పూర్తి జీతాలు చెల్లించాలని గుర్తు చేశారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ కాలేజీపై విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు.