Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని పేర్కొంటూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ఇఎన్సి సి.మురళీధర్ నేతృత్వంలో ఉప సంఘం పనిచేస్తుంది. గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో సంబంధిత అంశాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, సిడబ్ల్యూసి ఆపరేషన్ ప్రోటోకాల్స్‌పై దృష్టి సారించాలని పేర్కొంది. ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను అధ్యయనం చేయాలని పేర్కొంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదిస్తున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలపై సిఫారసులు చేయాలని ఉప సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.