Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీఐఎల్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ-కాప్రా
హింసోన్మాదాన్ని, మహిళలపై దాడులను అరికట్టి, ఆడ బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణ జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. ఆశాలత అన్నారు. గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఐద్వా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లోని కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భ ంగా వారు పాల్గొని మాట్లాడారు. మహిళలపై దాడులు, హింస రోజురోజుకూ పెరుగుతున్నాయనీ, మహిళలకు భద్రత కరువైందని ఆవే దన వ్యక్తం చేశారు.హింసకు, దాడులకు కారణమవుతున్న డ్రగ్స్, అశ్లీల చిత్రాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వంటగ్యాస్, ఇతర నిత్యావసర ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు చల్లా లీలావతి, శశికళ, మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. సృజన, ఎం. వినోద, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. లక్ష్మీదేవి, బి. మంగ, కోశాధికారి సఫియా సుల్తానా, శ్రామిక మహిళా నాయకులు ఎం. సబిత, జిల్లా కమిటీ సభ్యులు కొలిపాక విజయలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.