Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇన్సూర్న్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ ఆప్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) 5వ స్నాతకోత్సవం గురువారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఘనంగా జరిగింది. ఐఐఆర్ఎం మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ మాథూర్ ముఖ్యఅతిధిగా పాల్గొని 2019-21 బ్యాచ్ రెండేండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ పీజీ ప్రోగ్రామ్స్ డిప్లొమా, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమాతోసహా వివిధ సేవలు, పరిశ్రమలకు అవస రమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి తమ సంస్థ ఆర్థికరంగంలో అత్యుత్తమ కేంద్రంగా నిలుస్తున్నదని చెప్పారు. విద్యార్థు లు,పరిశ్రమల నుంచి మంచి స్పందన వస్తున్నదని అన్నారు. కొద్దికాలంలోనే తమ సంస్థలోని విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్లు లభించాయని వివరించారు. వృత్తిపరమైన ప్రపంచంలో చిత్తశుద్ధి, అంకితభావంతో వాస్తవికంగా నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఐఆర్ఎం ప్రిన్సిపాల్ వివికె మోహన్ పాల్గొన్నారు.