Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు షురూ..
- ప్రాంగణాన్ని పరిశీలించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీని ఈనెల 25న నిర్వహించబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఊపందుకున్నాయి. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ నిర్వహించబోయే ప్రాంగణాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్లీనరీ మొత్తం సజావుగా సాగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆహార, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు, వాలంటీర్లు, పార్కింగ్, భోజనం, తీర్మానాలు, మీడియా, నగర అలంకరణ తదితర కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు. ఆహ్వానితులు మాత్రమే సమావేశానికి రావాలని సూచించారు.
కమిటీలు- బాధ్యులు...
- ఆహార కమిటీ--సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రడ్డి,అరికెపూడి గాంధీ,గద్వాల విజయలక్ష్మి
- సభా వేదిక ప్రాంగణం --- మాగంటి గోపీనాథ్, నవీన్ కుమార్, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బొంతు రామ్మోహన్
- ప్రతినిధుల --- శంభీపూర్ రాజు
- పార్కింగ్ --- కేపీ వివేకానంద
- ప్రతినిధుల భోజనం---మాధవరం కృష్ణారావు
- తీర్మానాలు ---మధుసూదనాచారి, పర్యదా కృష్ణమూర్తి
- మీడియా--- ఎమ్మెల్సీ భానుప్రసాద్, కర్నె ప్రభాకర్
- గ్రేటర్ అలంకరణ--- జీహెచ్ఎమ్సీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు