Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు : డైరెక్టర్ ఎం. అఖిల్
హైదరాబాద్ : లాట్ మోబైల్స్ నూతన ప్రచారకర్తగా రష్మిక మందన వ్యవహరిస్తున్నట్టు డైరెక్టర్ ఎం.అఖిల్ పేర్కొన్నారు. రాబోయే ఏడాది లోగా లాట్ మొబైల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 100కు పైగా స్టోర్స్‌ని విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. లాట్ మొబైల్స్ తమ వినియోగదారుల కోసం దసరా పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్లను అందజేయనుందని తెలిపారు. గత 9 ఏండ్ల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 150 స్టోర్స్‌కు చేరువలో విజయవంతంగా ముందడుగు వేస్తుందని అన్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. లాట్ మొబైల్స్‌లో శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఎగ్జిక్యూటివ్స్ స్మార్ట్స్ ఫోన్ల వాడకందారుల అవసరాలను గుర్తించి వారికి అత్యుత్తమమైన మెరుగైన సేవలను అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నామని అన్నారు. వినియోగదారుల గృహౌపకరణాల అవసరాలకు అనుగుణంగా తగిన ఎలక్ట్రానిక్ వస్తువులను అందుబాటులో ఉంచుతూ విజయవంతంగా ముందడుగు వేస్తున్నామని అన్నారు. లాట్ మొబైల్స్ 'నో క్వఛ్చన్ ఆక్స్‌డ్'' అసూర్డ్ పే బ్యాక్ విధానాన్ని పాటిస్తూ పాత మొబైల్స్ స్థానంలో కొత్త మొబైల్స్ అందించే ప్రక్రియను 5నిమిషాల్లో పూర్తి చేస్తుందన్నారు. లాట్ మొబైల్స్ తమ బ్రాంచ్ అంబాసిడర్‌గా యువకుల హృదయాలను దోచుకున్న అగ్రతార రష్మిక మందనను ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన మాట్లాడుతూ లాట్ లాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దసరా పండుగ సందర్భంగా లాట్ సంస్థ తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన పలు వినూత్న ఆఫర్లను అందజేస్తున్నదని డైరెక్టర్ ఎం.అఖిల్ పేర్కొన్నారు. స్క్రాచ్‌కార్డుపై 10శాతం వరకు గ్యారెంటెడ్ క్యాష్‌బ్యాక్, అప్పో మొబైల్స్ పైన గరిష్టంగా 15శాతం క్యాష్ బ్యాక్, వివో మొబైల్స్ పైన గరిష్టంగా 10శాతం క్యాష్ బ్యాక్, ఎంపిక చేసిన సామ్సంగ్ ఫోన్స్పైన గరిష్టంగా రూ.10,000 క్యాష్ బ్యాక్, షియోమి ఫోన్స్ కొనుగోలు చేసేవారికి గరిష్టంగా 10శాతం క్యాష్ బ్యాక్, పేటిఎం క్యాష్ బ్యాక్, ఇఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి (బజాజ్ ఫైనాన్స్) ద్వారా గరిష్టంగా రూ.3500 క్యాష్ బ్యాక్, కార్డ్‌లెస్ ఇఎంఐ సౌకర్యం, రూ.1/-డెబిట్ కార్డు, 0శాతం డౌన్‌పేమెంట్, 0శాతం ఫైనాన్స్ స్కీమ్‌తో పాటు మరెన్నో ఆఫర్లను అందిస్తున్నట్టు ఎం. అఖిత్ తెలిపారు. వినియోగదారులంతా దసరా సందర్భంగా అందజేస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.