Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పుడమి పులకించింది.. పురుడుపోసుకుంది బంగారు బతుకమ్మగా!
మట్టిలోపుట్టి..ఇసులో ఎదిగి,
ఇలలోకి తొంగిచూసింది.
నింగిలో తలతలాడిండింది..
తంగేడు పూల వనంలో వికసించింది పుత్తడిబొమ్మ,
గునుగుపూలసింగడై పరిఢవిల్లింది..
ఎంగిలిపూల బతుకమ్మ వాడవాడలో ఎగసిపడిమురిసింది.
సద్దుల బతుకమ్మతో విరబూసి,
ప్రకృతికి పచ్చని హరివిల్లైంది..!!!
తెలంగాణ మాగాణాల్లో గుమ్మడి పూలవనమై..
రంగుల వసంతమై..
పూల పరిమళాన్ని ఆస్వాదించగా వచ్చింది
అడవిలోని అందాలజాన..!!!!
పాటల పండుగై..
వీనులవిందైంది
భవబంధాలను కలిపింది..
తొలుసూరు బిడ్డ బతుకమ్మ..!!!! పూలన్నిచెలికత్తెలై,
మా లోగిల్లోసందడి చేస్తుంది.. కొండంత అండ బంగారు కొండ.
పచ్చని భువనములో, పరిఢవిల్లుతున్న పుత్తడిబొమ్మ కు,
వైభవంగా జరుగు తుంది..పది రోజుల ప్రకృతి బతకమ్మపండుగ..!!!!!
బతుకమ్మా గిది ఎరుకేనా? మధమోహాం మరిగిన
మృగాల వేటలో..
బలవుతున్నరు లేడి కూనలు.. ముష్కరుల విషశ్వాంగాలకు రాలుతున్నరు..నేలకొరుగుతున్నరు..
నిలువెల్ల వల్లుబలిసిన
రాబందుల రాక్షస క్రీడలో నలుగుతున్నరు.. వదుగుతున్నరు..!!!!!
తన ఆడబిడ్డలను కాపాడుకోలేదా
ఆ నింగి నేల!?
మురిసిపోవా సి(స్త్రీ)రి మోములు..!?
ఇళ్ళు,పల్లేలోగిల్లో
బతకనిద్దాం,చదువునిదాం ఎదగనిద్దాం బతుకమ్మను..!!?
- బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో.. డి.కృష్ణయ్య(హిమబిందు).వీపనగండ్ల