Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన మోటార్లకు బోల్టులు బిగించారే తప్ప మీరేం చేయలేదని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగ సభ విషయంలో మంత్రులు అనవసర రాద్ధాంతంచేస్తున్నారని చెప్పారు. అక్రమ ప్రాజెక్టులపై నోరుమెదపని మంత్రులకు రేవంత్‌రెడ్డిని విమర్శించే హక్కులేదన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు రూపకల్పన ప్రగతిభవన్‌లో జరిగిందని ఆరోపించారు.