Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌తో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఈమేరకు హైదరా బాద్‌లోని డీఎస్నివాసంలో కలిశారు. తాజా రాజకీయపరిస్థితులపై చర్చిం చినట్టు తెలిసింది. రేవంత్ మాట్లాడుతూ మర్యాద పూర్వకం గానే డీఎస్‌ను కలిసినట్టు చెప్పారు. ఆయన కిందపడిపోగా చెయ్యి విరిగిందనీ, ఈవిష యం తెలిసి పరామర్శించేందుకు వచ్చానని అన్నారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవనీ, శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషి అందుకే పలకరించేందుకు వచ్చినట్టు చెప్పారు. డిఎస్మాట్లాడుతూ తాను కిందపడిపోగా చెయ్యి విరిగిందనీ, ఈ విషయం తెలిసిన రేవంత్ తనను పలకరించటానికి వచ్చారని తెలిపారు. ఇందులో రాజకీయాలు లేవనీ, వయస్సులో చిన్నవాడైనా తాను కింద పడ్డానని తెలిసివచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించ డానికి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.