Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరుములు, మెరుపులతో వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం కూడా రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశముందని తెలిపింది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ కుండపోతగా కురిసిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.