Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ వెల్లడి
- భారీగా హాజరైన మావోయిస్టులు
- ఆర్కే మృతి పట్ల సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ సంతాపం
నవతెలంగాణ-చర్ల/హైదరాబాద్
నాలుగు దశాబ్దాల పాటు మూడు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్(63) అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అనారోగ్యంతో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అభరు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అకస్మాత్తుగా కిడ్నీల సమస్య రావడంతో వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిలవడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి మృతిచెందినట్టు పేర్కొన్నారు.కాగా, ఆర్కే అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పామేడు పోలీస్ స్టేషన్ పరిధి కొండ పల్లి అటవీ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తున్నది. ఆదివాసీ పల్లె ప్రజల నీరాజనాల నడుమ ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ శనివారం ఫొటోలు విడుదల చేసింది. భారీగా మావోయిస్టులు హాజరైనట్టు తెలుస్తున్నది.
ఆర్కే మృతి విప్లవోద్యమానికి తీరనిలోటు: సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు
సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు రామకృష్ణ అకాల మరణం భారత విప్లవోద్యమానికి తీరని నష్టమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్కేకు విప్లవ జోహార్లు : పొటు రంగారావు
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు, పోలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకష్ణ (ఆర్కే) అనారోగ్యంతో మతి చెందడం పట్ల సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణా రాష్ట్ర కమిటీ సంతాపం వ్యకం చేసింది. కామ్రేడ్ ఆర్కేకు విప్లవ జోహార్లు అర్పిస్టున్నట్టు ప్రకటించింది. ఆయన కుటుంబానికి, పార్టీ సహచరులకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పొటు రంగారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామ్రేడ్ ఆర్కే తాను ఎంచుకున్న విప్లవమార్గంలో నాలుగు దశాబ్దాల పాటు అలుపు లేకుండా పని చేశారని కొనియాడారు. చివరి శ్వాస దాకా పట్టుదలగా,ఆదర్శంగా పనిచేశారని ప్రశంసించారు.ఇది కమ్యూనిస్ట్ ఉద్యమానికి, విప్లవోద్యమానికి, పీడిత ప్రజల కోసం సేవలందించారన్నారు.దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్ట్ విప్లవాన్ని సాధించే కషి చేయడమే ఆర్కేకు గానీ, వేలాది మంది అమరవీరులకుగానీ మనం అర్పించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. నిర్బంధాన్ని, అణచివేతను అధిగమిస్తూ, అననుకూల తలను తొలగించుకుని ఫాసిస్టు, భూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా దఢ సంకల్పంతో పోరాట కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు.