Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మెన్ వేదకుమార్
హైదరాబాద్ : హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి ఏఎస్ఐ సైన్స్ బ్రాంచ్‌ను నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మెన్ ఎం. వేదకుమార్ అన్నారు. స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తులకు స్పందించి హైదరాబాద్‌లో ఉన్న ఏఎస్ఐ సైన్స్ బ్రాంచ్‌ను ముంబయికి తరలించకుండా విరమించుకున్నందుకు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 1953లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఏఎస్ఐ సైన్స్ బ్రాంచ్ వారసత్వ కట్టడాలపై అనేక పరిశోధనలు, అధ్యయనాలు చేసి వాటి సంరక్షణ కోసం చర్యలపై పని చేస్తుంది. రామప్ప ఆలయానికి ప్రపంచవారసత్వ హౌదాను తీసుకురావడంలో ఈ సంస్థ తన వంతు పాత్రను పోషించిందని వేదకుమార్ వివరించారు. తెలంగాణలోని వారసత్వ కట్టడాలు, హైదరాబాద్‌కు వారసత్వ హౌదాను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.