Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిండి ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకుల మృతి
నవతెలంగాణ-డిండి/అచ్చంపేట
సెల్ఫీ కోసం వెళ్లి డిండి ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకులు మృతిచెరదిన సంఘటన ఆదివారం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్నహైదరాబాద్‌కు చెందిన బుద్దారం ప్రవీణ్ (23), హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ సాగర్ (21) తమ స్నేహితులు అనిల్‌కుమార్, విశువల్, బాల్‌రాజు, వంశీలతో కలిసి ఈ నెల 15న శ్రీశైలం వెళ్లారు. అక్కడ దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో డిండి ప్రాజెక్టుకు చేరుకున్నారు. డిండిప్రాజెక్టు అలుగు పోస్తున్నందున ఆనకట్ట కింది భాగాన సెల్ఫీ తీసుకొనేందుకు వెళ్లి సాగర్ కాలుజారి నీటిలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు పోయిన ప్రవీణ్ నీటిలో మునిగాడు. గమనించిన స్థానికులు చేపలు పట్టేవల ద్వారా వారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డిండి ఎస్ఐ పోచయ్య తెలిపారు.