Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీ ణులు, గిరిజన ప్రాంతాల ప్రజలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు అవసరమైన సేవలందించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. ఆ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఎనిమిది విభిన్న విభాగాల్లో డాక్ సేవ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహమ్మారి కాలంలో ఆసరా, పెన్షన్లు, పట్టాదార్ పాస్బుక్లు మొదలైన వాటిని ప్రజలకు వారి ఇంటి వద్దనే అందించేందుకు వీలుగా పోస్టల్ శాఖ విశేషమైన కషి చేసిందని కొనియాడారు. ఉద్యోగుల నిష్కళంకమైన సేవాభావం, పనితీరు, నాయకత్వ లక్షణాలతో ఆ శాఖ ప్రతిష్ట పెరిగిందని అభిప్రాయపడ్డారు. సేవలందించడంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, మఖ్దూమ్ మొయినుద్దీన్ మహనీయుల సేవలను గుర్తించి, ''ఆజాది కా అమృత్ మహౌత్సవంలో '' భాగంగా స్వాతంత్య్ర పోరాటంలో వారి సేవలను స్మరించుకోవడానికి తపాలా శాఖ ప్రత్యేక కవర్ని విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎమ్. శ్రీలత, డాక్టర్ పివిఎస్ రెడ్డి, కె దేవరాజ్,ఎస్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.