Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న దుకాణదారులు
- అడ్వాన్స్ డీడీ డబ్బులు ఇవ్వాలి
- ముందుగానే నోటీసులు ఇవ్వలె : దుకాణదారులు
నవ తెలంగాణ - మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని 16 షాపులను పోలీసుల బందోబస్తుతో ఆర్టీసీ యజమాన్యం కూల్చివేసింది. దుకాణదారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. దుకాణదారులు లబోదిబోమంటున్నా.. ఆర్టీసీ అధికారులు తమ పని తాము చేసుకుని పోతున్నామని తెలిపారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని మేము అడ్వాన్స్గ్ చెల్లించిన డీడీ డబ్బులు కూడా నేటికి తిరిగి ఇవ్వలేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు మాత్రం వీరికి ముందుగానే నోటీసులు అందించామనీ, కాలపరిమితి ముగిసినందున.. తొలగించాల్సి వస్తుందని చెబుతోంది. ఇక్కడ దుకాణాలు నడుపుతున్న వారు మా దగ్గర టెండర్ వేసిన వారు కారనీ, మొత్తం 16 షాపులను తొలగించామని తెలిపారు. దుకాణదారులు మాత్రం మాకు న్యాయం చేయాలని, అడ్వాన్స్గ్ చెల్లించిన డీడీ డబ్బులు ఇప్పించాలని కోరారు.