Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఐటీ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (గౌలిదొడ్డి ఐఐటీ-బాలుర) విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఒకరకంగా వారు చరిత్రను సృష్టించారు. అక్కడి ప్రిన్సిపాల్ సత్యనారాయణ చొరవతో 59 మంది విద్యార్థులు ఐఐటీ సాధిచారు. మరో వైపు బాలురకు ఏ మాత్రం తీసిపోని విధంగా కమ్మధానం తెలంగాణ గురుకుల కళాశాల నుంచి తొమ్మిది మంది విద్యార్థినులు ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా అందులో నుంచి ఒకే ఒక్క అమ్మాయి మోతుకూరి బిందు ఐఐటీ (జేఈఈ) అడ్వాన్స్లో సీటు సాధించింది. తమ కూతురు ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించినందుకు ఆమె తండ్రి మోతుకూరి యాదయ్య హర్షం వ్యక్తం చేశారు. తనకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు హేమలత, గోపాల్, శ్రీకాంత్, శారద, ప్రశాంత్, సాయిప్రకాశ్ లెక్చరర్లకు బిందు, ఆమె తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఉన్నత భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమించి మంచి పునాది వేసిన ప్రధానోపాధ్యాయులు విద్యులతకు బిందు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అందించినటువంటి తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు, మరియు ఉపాధ్యాయ బృందానికి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన ్(టీజీపీఏ) రాష్ట్ర మీడియా ప్రతినిధి అంబాల కిరణ్ కుమార్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.