Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లకు అలుగుబెల్లి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలలకు 2019-20 వరకు పారిశుధ్య కార్మికులను నియమించిన పద్ధతిలోనే తిరిగి నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన గ్రామ పంచాయితీల సర్పంచ్ లు, మున్సిపాల్టీల చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లకు బహిరంగ లేఖ రాశారు. ఒక్కో పారిశుధ్య కార్మికునికి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తే రూ.150 కోట్లు సరిపోతాయని తెలిపారు. ఆ నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో సిబ్బంది మంచిగా శుభ్రం చేయించారన్నారు. 1933 ప్రభుత్వ పాఠశాలల వివరాలను సేకరిస్తే 20.5 శాతం పాఠశాలల్లో బాగా చేస్తున్నారనీ, 32.9 శాతం అడపాదడపా చేస్తున్నారనీ, 47.6 శాతం పాఠశాలల్లో అధ్వాన్నంగా ఉందనీ, 60 శాతం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే తాళాలు వేసుకోవటం, తీసుకోవటం చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.