Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఓపెన్‌కేటగిరీలో 1,4,5,9 టాప్ ర్యాంకులు
హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్డ్ 2021 ఫలితాల్లో సౌతిండియా ఫస్ట్‌ను నారాయణ విద్యార్థిని పల్లె భావనకు దక్కింది. ఓపెన్‌కేటగిరిలో ఆలిండియా టాప్ 1,4,5,9 వంటి టాప్ 4 ర్యాంకులు నారాయణ విద్యార్థులకు దక్కాయి. టాప్ 100లో 26 ర్యాంకులతో జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా లీడర్‌గా నారాయణ నిలిచింది.
అన్ని కేటగిరీల్లో టాప్ 10లో 15 ర్యాంకులు,టాప్ 100లో 98 ర్యాంకులు సాధించింది. నారాయణ విద్యార్థులు 1000లోపు 503ర్యాంకులు సాధించి ఏకఛత్రాధిపత్యాన్ని మరోసారి నిలుపుకున్నది.ఐఐటీ ఆశయాలను సాకారం చేయటంలో మరెవ్వరూ సాటిరారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూర నారాయణ,పి.శరణి నారాయణ పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మృదుల్ అగర్వాల్ (ఓటీఎస్)(హెచ్‌టి నెం.2050447) 1 వ ర్యాంకు,సంతోష్‌రెడ్డి (హెచ్‌టి నెం. 6115012) 4వ ర్యాంకు, సాయిలోకేశ్ రెడ్డి (హెచ్‌టి నెం.6103113) 5వ ర్యాంకు, ఆర్నవ్ ఆదిత్యసింగ్ (ఓటీఎస్)( హెచ్‌టి నెం.2063168) 9 వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.అలాగే పల్లె భావన (హెచ్‌టి.నెం.6105178) సౌతిండియా ఫస్ట్ సాధించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1.64లక్షల మది విద్యార్థులు పోటీపడగా..పరీక్షాఫలితాల్లో అత్యధికసంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు.
ఈ అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు,అధ్యాపక బృందానికి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.సింధూర నారాయణ,శరణి నారాయణ అభినందలు తెలిపారు.