Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎగబడిన జనం
నవతెలంగాణ-తిమ్మాపూర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యామ్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా భారీ సుడిగాలి లాగా మానేరు డ్యామ్ నుంచి నీరు ఆకాశం వైపు వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన జనాలు ఒకింత షాకయ్యారు. ఈ విషయం ఆనోటా.. ఈ నోటా పాకడంతో అద్భుతాన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. మానేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో వరి పంట దగ్గర పనులు చేస్తున్న రైతులు మొదట ఈ దృశ్యాన్ని చూశారు. జనాలు ఈ అద్భుతాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. 2016 జూలై 31న దిగువ మానేరు జలాశయం మధ్యలో ఇలాంటి టోర్నడో దృశ్యమే కనువిందు చేసింది. ఐదేండ్ల తర్వాత మానేరు డ్యామ్ నుంచి మరోసారి టోర్నడోలాగా 30 నిమిషాల పాటు నీరు పైకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.