Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల భారీ కూంబింగ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మావోయిస్టు నేత మాడ్వి హిడ్మా అనారోగ్యంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో వున్నాడన్న సమాచారం మేరకు ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే మృతి అనంతరం హిడ్మా అనారోగ్యంతో వున్నట్టు, ఆయనకు తెలంగాణలో వైద్యసేవలు పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఏటూర్‌నాగారం ఏజెన్సీ అటవీ ప్రాంతంపై పోలీసు అధికారులు దృష్టి సారించి పెద్ద ఎత్తున కూంబింగ్‌కు దిగారు.