Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుభీర్‌లో కొనుగోళ్లు ప్రారంభం
నవతెలంగాణ-కుభీర్
నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం సోయా కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ కందూర్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సోయా పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించాలన్నారు. సోయా క్వింటాల్‌కు రూ.5,150 మద్దతు ధర ఉందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలతో రైతులు చాలా పంట నష్టపోయారని వారికి మద్దతు ధర అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నష్ట పోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, పీఏసీఎస్ చైర్మెన్ గంగా చరణ్, వైస్ ఎంపీపీ మోహినోద్దీన్, మాజీ జెడ్పీటీసీ శంకర్ చవాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్ మీరా విజరు కుమార్, వ్యాపారవేత్తలు సంతోష్, రఫీక్, అప్సర, నాయకులు బాబు, మండలాధికారులు ఉన్నారు.