Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11.30కు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్తారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు ముగిసిన నేపథ్యంలో పున్ణప్రారంభం తేదీ ముహూర్తాన్ని ప్రకటిస్తారు. ఈ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దాన్నే సీఎం కేసీఆర్ అధికారికంగా అక్కడే ప్రకటించనున్నారు. ఆ సందర్భంగా నిర్వహించే మహా సుదర్శన యాగం వివరాలను కూడా వెల్లడిస్తారు.