Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో కలిశారు. పదోన్నతులు కల్పించినందుకు మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా పథకాలన్నీ సకాలంలో అందేలా పనిచేయాలని మంత్రి వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవేందర్రావు, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.